అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరి 20వ తేదీన వారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వాన కమిటీ ఇన్విటేషన్ కార్డులను పంపుతోంది. ఈ ఆహ్వానపత్రికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా, ప్రఖ్యాత సింగర్ జెన్నీఫర్ లోఫెజ్, అమెరికన్ కవయత్రి అమండా గోర్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురేషన్ కమిటీ గురువారం ప్రకటించింది.