జగిత్యాల జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. మేడిపల్లి మండలం గోవిందారంలో పర్యటించిన ఆయన కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోవడానికి ఇది టిఆర్ఎస్ పార్టీ కాదని అన్నారు. మేము ఉద్యమం చేసేంతవరకు చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రికి ఉద్యమం ద్వారా భయం చూపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖుడిలా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారన్న ఆయన బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. బిజెపి కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించవద్దు తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ఆ దమ్ము ముఖ్యమంత్రికి ఉందా…? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారు అడ్డంగా దోచుకున్నారు ఇప్పుడు మళ్లీ కలిసి పని చేద్దాం అంటున్నారని ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని నాయకులు కలిసి పనిచేద్దాం అంటారా..?? అని అయన ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల పైన నాయకులపైన దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు అని ఆయన ప్రశ్నించారు.