మూడు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు లాసెట్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. చైర్మన్ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్, పీజీ ఎల్‌సెట్ సమావేశం బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. కన్వీనర్‌గా ఉస్మానియా న్యాయ కళాశాల ఆచార్యులు జీబీ రెడ్డిని నియమించారు. లాసెట్ పరీక్ష, సిలబస్, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. నోటిఫికేషన్‌ను మార్చి 24న విడుదల చేస్తారు. మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్‌కు దరఖాస్తు రుసుము రూ.800, పీజీ ఎల్‌సెట్‌కి రూ.1000గా నిర్ణయించారు. ఆగస్టులో పరీక్ష ఉంటుందని, పరీక్ష సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు.
credit: third party image reference